Burgampahad: బూర్గంపాడు అధికారుల నిర్లక్ష్యానికి అంతులేదా?

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో బతికున్న 80 ఏళ్ల వృద్ధుడిని ఆన్‌లైన్ రికార్డుల్లో మృతుడిగా నమోదు చేసి ఆసరా పెన్షన్ నిలిపివేసిన ఘటన కలకలం రేపింది.

RAVI, BURGAMPAD AREA
Published on: 28 Nov 2026 9:15 AM IST
Burgampahad
X

Burgampahad: బూర్గంపాడు అధికారుల నిర్లక్ష్యానికి అంతులేదా?

బూర్గంపాడు: బతికున్న మనిషిని మృతుడిగా చూపించి పెన్షన్ నిలిపివేయడం.. వికలాంగుల పేర్ల స్థానంలో వారి తండ్రుల పేర్లు నమోదు చేయడం! ఇదీ బూర్గంపాడు మండలంలో ప్రభుత్వ రికార్డుల నిర్వహణ తీరు. అర్హులైన లబ్ధిదారులకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలో ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మండలంలోని ఓ గ్రామానికి చెందిన సుమారు 80 ఏళ్ల వృద్ధుడికి నెలకు రూ.2,016 ఆసరా పెన్షన్ మంజూరైంది. అయితే ఆన్‌లైన్ రికార్డుల్లో ఆయనను బతికుండగానే మృతుడిగా (Death) నమోదు చేసి, 2026 జూలై 29న పెన్షన్ జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో వృద్ధుడికి అందాల్సిన పెన్షన్ నిలిచిపోయింది. మరోవైపు వికలాంగుల పేర్లకు బదులుగా వారి తండ్రుల పేర్లు నమోదు కావడం అధికారుల రికార్డుల నిర్వహణపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

అసలు అధికారులు ఏం చేస్తున్నారు?* లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారా? ఒక వ్యక్తి బతికున్నాడో లేదో నిర్ధారించకుండా మృతుడిగా ఎలా నమోదు చేశారు? వికలాంగుల వివరాల్లో ఇలాంటి తప్పులు ఎలా దొర్లాయి? ప్రతి నమోదును పరిశీలించి ధ్రువీకరించాల్సిన అధికారులు, పర్యవేక్షణ బాధ్యత కలిగిన ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు?

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అధికారుల నిర్లక్ష్యానికి బలైతే బాధితులకు న్యాయం చేసేది ఎవరు? తప్పిదాలు చేసిన వారిని గుర్తించి బాధ్యత వహించేలా చర్యలు తీసుకునే అధికారం లేదా? జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి పెన్షన్ రికార్డులపై సమగ్ర విచారణ చేపట్టి, తప్పులను సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA