Kothagudem: విద్యార్థులకు గుడ్ న్యూస్ సమ్మర్ క్యాంప్‌ను ప్రారంభించిన కలెక్టర్!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో సమ్మర్ క్యాంప్‌ను కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 11 May 2026 1:50 PM IST
Kothagudem
X

Kothagudem: విద్యార్థులకు గుడ్ న్యూస్ సమ్మర్ క్యాంప్‌ను ప్రారంభించిన కలెక్టర్!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సమ్మర్ క్యాంప్ ను ఉపయోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్ వీక్ ను పురస్కరించుకొని జూలూరుపాడు లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో బాలికల కోసం ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంపును కలెక్టర్ ప్రారంభించారు.

సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు విద్యుత్ తో పాటు, క్రీడల్లో మెళ్ళుకువలను నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడలను రాడిస్తే తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవచ్చు అన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన విధంగా బాలికల్లో స్కిల్స్ ను పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. శిబిరానికి హాజరైన బాలికలకు నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ మండల పరిధిలోని దండుమిట్ట తండా ప్రాథమిక పాఠశాలలో 2 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న బాలుర మరుగుదొడ్డి నిర్మాణానికి, పాపకొల్లులో పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో రూ1.10 లక్షల నిధులతో చేపడుతున్న ఇంకుడు గుంతల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో అజయ్, ఎంఈఓ జుంకీలాల్, ఎంపీ ఓ తులసీరామ్, ఎస్ ఓ పద్మజ, ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story