Kothagudem: వైద్య అధికారులకు వ్యాక్సిన్ నివారించగల వ్యాధులపై అవగాహన శిక్షణ

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధులపై (VPD) ప్రత్యేక అవగాహన.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 May 2026 6:36 PM IST
Kothagudem
X

Kothagudem: వైద్య అధికారులకు వ్యాక్సిన్ నివారించగల వ్యాధులపై అవగాహన శిక్షణ

Kothagudem: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డా. తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు నేడు జిల్లా పరిధిలోని PHCs, UPHCs మరియు UFWCs వైద్య అధికారులకు వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధులు (Vaccine Preventable Diseases) పై అవగాహన మరియు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పోలియో మరియు మీజిల్స్ (Measles) వ్యాధుల లక్షణాలు, అనుమానిత కేసులను గుర్తించే విధానం, వెంటనే చేపట్టాల్సిన విచారణ (Investigation), నమూనాల సేకరణ, ఫాలోఅప్ చర్యలు, వ్యాధి నియంత్రణ చర్యలు మరియు నివేదికల సమర్పణ విధానాలపై సమగ్రంగా వివరించారు.

జిల్లాలో వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల నిర్మూలన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి వైద్య అధికారి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని, అనుమానిత కేసులను వెంటనే గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో డా. ప్రసాద్, PO-IDSP, డా. ప్రతాప్, PO-CHI, డా. రాకేష్, PO-MHN, డా. దినేష్, PO-NCD, డా. హరీష్, PO-DTT మరియు జిల్లా పరిధిలోని అన్ని PHCs, UPHCs, UFWCs వైద్య అధికారులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story