Bhadradri Kothagudem: ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా వైద్య అధికారి డాక్టర్ తుకారం రాథోడ్
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.
Bhadradri Kothagudem: ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా వైద్య అధికారి డాక్టర్ తుకారం రాథోడ్
కొత్తగూడెం: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు అనగా 10-05-2026 న జిల్లా కార్యాలయం నందు జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ప్రోగ్రాం ఆఫీసర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే అన్ని ఆరోగ్య కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి కార్యక్రమంపై ఫీల్డ్ వైజ్ సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, అలాగే ప్రోగ్రాం ఆఫీసర్లు కూడా సెషన్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రతి ఇమ్యునైజేషన్ సెషన్‌లో టీకాలు వేసిన అనంతరం సంభవించే అవాంఛనీయ ఘటనలను ఎదుర్కొనేందుకు ఉపయోగించే AEFI కిట్‌ను తప్పనిసరిగా ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
జిల్లాలోని సూపర్వైజర్లు తమ తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఫిక్స్‌డ్ టూర్ ప్రోగ్రాం తయారు చేసి జిల్లా కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు. సమర్పించని యెడల సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇంక్రిమెంట్లు నిలిపివేయబడతాయని హెచ్చరించారు.
అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలలోని స్టోర్లలో స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను డిస్ప్లే బోర్డుపై తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆర్టిఐ (RTI )డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని తెలిపారు.
వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ (WIFS) కార్యక్రమాన్ని ప్రోగ్రాం ఆఫీసర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే ICDS శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్నేహ మీటింగ్‌లలో చైల్డ్ మ్యారేజ్‌లు, రక్తహీనత, చైల్డ్ లేబర్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నందున, సంబంధిత మండలాల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ప్రసాద్ , డాక్టర్ ప్రతాప్ ,డాక్టర్ రాందాస్, డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.




