Julurupadu: తుఫాన్ బాధితులను ఆదుకోవాలి: బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్!

Julurupadu: జూలూరుపాడులో తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్, రైతులకు నష్టపరిహారం, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 4 Nov 2026 5:44 PM IST
Julurupadu
X

Julurupadu: తుఫాన్ బాధితులను ఆదుకోవాలి: బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్!

జూలూరుపాడు: జూలూరుపాడు మండలంలో తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్, ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ వల్ల జూలూరుపాడు మండలంలో పత్తి, మిర్చి, వరి తోపాటు కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి, పత్తి రైతులు మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలినది, మొన్నటి దాకా ఎల్ నీ నో ప్రభావాలు నష్టపోయిన రైతులు ఎంతో కష్టపడి పత్తి పంట పండించినారు, పత్తి చేతికి వచ్చే సమయానికి అకాల తుఫాను రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం జల్లులు పడటంతో ప్రత్తి గింజలు మొలకెత్తినాయి.

కావున తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి. రైతులకు రుణమాఫీ చేయాలి, రైతులకు రైతు భరోసా డబ్బులు రైతుల ఎకౌంట్లో వేసి ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల బీమాను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంటల బీమా అమలు చేయకపోవడంతో రైతుకు తీవ్ర నష్టం జరిగినది.

రైతు కూలీలకు సంవత్సరానికి ₹12,000 ఇస్తానని ఈరోజు వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయపోవటం వల్ల ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కావున కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సిరిపురపు ప్రసాద్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సిరిపురపు పుల్లారావు, నర్వనేని కృష్ణ, వందన సుబ్బు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU