Julurupadu: జూలూరుపాడులో జలగల్లా పీడిస్తున్న అధిక వడ్డీ వ్యాపారులు!

Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వడ్డీ వ్యాపారులు ఇళ్లు, పొలాలు, బంగారం తాకట్టు పెట్టుకుని వందకు రూ.10 వడ్డీ వసూలు చేస్తూ వేధిస్తున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 20 Nov 2026 2:07 PM IST
Julurupadu
X

Julurupadu: జూలూరుపాడులో జలగల్లా పీడిస్తున్న అధిక వడ్డీ వ్యాపారులు!

జూలూరుపాడు: జూలూరుపాడు మండలంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సామాన్య కుటుంబల వారి అవసరాలను అదునుగా భావించి కొందరు వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ జలగల్లా పట్టిపీడిస్తున్నారు. తీసుకున్న డబ్బులు కట్టలేక అధిక వడ్డీలు చెల్లించలేక సామాన్య కుటుంబాల వారు చిత్తవుతున్నారు. ఇంతగా వడ్డీల వసూళ్లకు పాల్పడుతున్న వ్యాపారిస్తులు ఏకంగా ఇళ్లు, పొలాలకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు, బంగారు నగలుతాకట్టు పెట్టుకొని మరి వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారు.

వీటితోపాటు ప్రాంసరీ నోట్, ఎం.టి చెక్కులను సైతం తీసుకుంటున్నారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. వీటన్నిటిని తాకట్టు పెట్టుకున్నప్పటికీ ఏమైనా వడ్డీ తక్కువ అంటే ఏకంగా 100 రూపాయలకు 10 రూపాయలు వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.

అదేంటి 100 కి ఒక రూపాయి లేదా రెండు రూపాయలు మాత్రమే వడ్డీ వసూలు చేయాలి కదా,ఇంత వడ్డీ ఎక్కడైనా ఉంటుందా ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు అవును సాధ్యమే అది కూడా జూలూరుపాడు మండలంలోని సాధ్యం. ఇంతగా వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారస్తులు ప్రతినెలా వడ్డీ చెల్లించాల్సిందే అంటూ ఆంక్షలు పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తీసుకున్న డబ్బులకు ప్రతినెల వడ్డీలు చెల్లించకపోతే ఎక్కడ పదిమందిలో అడిగి పరుగు తీస్తారో అని డబ్బులు తీసుకున్న వారు భయభ్రాంతులకు గురవుతున్నారు.

తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా చెల్లించినప్పటికీ కూడా తాకట్టు పెట్టుకున్న ప్రామిసరీ నోటు, ఎం.టి చెక్కులను తిరిగి ఇవ్వకుండా ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉందని వడ్డీ వ్యాపారస్తులు ఇబ్బందులు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తీసుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించకపోతే తాకట్టు పెట్టిన వాటిని స్వాధీనం చేసుకుంటామని వడ్డీ వ్యాపారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే వడ్డీ వ్యాపారస్తులు ఆగడాలు మరెన్నో చెప్పుకోవచ్చు. వడ్డీ వ్యాపారస్తుల బాధలను తట్టుకోలేని కొందరు ఇటీవల పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఏది ఏమైనాప్పటికీ వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు తగ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU