Manuguru: మణుగూరు బీటీపీఎస్‌లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త!
Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్)లో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త తన భార్య గొంతును బ్లేడుతో కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Manuguru: మణుగూరు బీటీపీఎస్‌లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త!
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు బీటీపీఎస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త బ్లేడుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మణుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన 31 ఏళ్ల రత్నకుమారి బీటీపీఎస్‌లో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తోంది. గత కొంతకాలంగా భర్త సాధనపల్లి నరసింహారావుతో కుటుంబ వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటూ తన తల్లి వద్ద నివసిస్తున్న రత్నకుమారిపై నరసింహారావు బీటీపీఎస్‌లోనే బ్లేడుతో గొంతు కోసి దాడికి పాల్పడ్డాడు. అనూహ్యంగా జరిగిన ఈ దాడితో బాధితురాలు తీవ్రంగా గాయపడి రక్తస్రావానికి గురైంది. వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బీటీపీఎస్‌కు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలే దాడికి కారణమా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో విచారణ చేపట్టారు. కట్టుకున్న భార్యపైనే భర్త బ్లేడుతో దాడికి దిగడం బీటీపీఎస్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు విచారణ చేపట్టారు.




