Manuguru: సిద్ధార్థ వొకేషనల్ కళాశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సిద్ధార్థ వొకేషనల్ జూనియర్ కళాశాలలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 15 Nov 2026 11:05 AM IST
Manuguru
X

Manuguru: సిద్ధార్థ వొకేషనల్ కళాశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

మణుగూరు: మణుగూరు పట్టణంలోని సిద్ధార్థ వొకేషనల్ జూనియర్ కళాశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి..

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వల్లభనేని అజయ్ కుమార్ మాట్లాడుతూ. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం,నైతిక విలువలను అలవర్చు కోవాలని సూచించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హార్ట్‌ఫుల్‌నెస్ ప్రతినిధి బాలకృష్ణ పాల్గొని విద్యార్థులకు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, సానుకూల ఆలోచనల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థుల కోసం వివిధ వినోదాత్మక కార్యక్రమాలు,ఆటలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు..

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సభాహత్,దీప్తి,హేమలత,రాజేశ్వరి,నర్సింహారావు, రష్మిత, నవ్, వాసుదేవ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ, ఆనందోత్సాహాల మధ్య బాలల దినోత్సవ వేడుకలు ముగిశాయి.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA