Kothagudem: మేడి అఖిల్ హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి పరిధిలో జరిగిన మేడి అఖిల్ హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 3 ఫోన్లు స్వాధీనం.
Kothagudem: మేడి అఖిల్ హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్!
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్ హత్య కేసులో పోలీసులు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు, ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న ఎదురుగడ్డ గ్రామానికి చెందిన సురేష్, పవన్, వినోద్‌లను అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
నిందితుల వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడి అఖిల్ హత్య కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, దర్యాప్తులో భాగంగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల పాత్ర, ఇతర సంబంధిత అంశాలపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




