Kothagudem: మద్యం మత్తులో ప్రాణం పోయింది.. బండరాయితో కొట్టి కిరాతక హత్య!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఘోర హత్య.
Kothagudem: మద్యం మత్తులో ప్రాణం పోయింది.. బండరాయితో కొట్టి కిరాతక హత్య!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం లారీ యార్డు వద్ద దారుణ హత్య చోటుచేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్రరూపం దాల్చగా, ఓ వ్యక్తిపై బండరాయితో తలపై బలంగా దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన కుందన్ సింగ్‌గా గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story




