Bhadradri Kothagudem: పాల్వంచలో షూటింగ్ రేంజ్ ఏర్పాటుకు కృషి చేస్తా: డీవైఎస్ఓ!
Bhadradri Kothagudem: పాల్వంచ శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో రైఫిల్ షూటింగ్ రేంజ్ ఏర్పాటుకు కృషి చేస్తానని భద్రాద్రి కొత్తగూడెం డీవైఎస్ఓ బి. అనూష క్రీడాకారులతో భేటీలో హామీ ఇచ్చారు.
Bhadradri Kothagudem: పాల్వంచలో షూటింగ్ రేంజ్ ఏర్పాటుకు కృషి చేస్తా: డీవైఎస్ఓ!
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన మరియు క్రీడల అధికారి శ్రీమతి బి. అనూష జిల్లా రైఫిల్ షూటింగ్ క్రీడాకారులను కలిశారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి మరియు SGF క్రీడా పోటీలలో పాల్గొని విజయాలు సాధించిన క్రీడాకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులు సాధించిన విజయాలు, పోటీలలో ఎదుర్కొన్న అనుభవాలు, భవిష్యత్తులో సాధించాలనుకుంటున్న లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైన ప్రోత్సాహం, శిక్షణ సదుపాయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. క్రీడాకారుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పాల్వంచలోని శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో అందుబాటులో ఉన్న ఒక హాల్‌లో రైఫిల్ షూటింగ్ రేంజ్ ను ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని DYSO అనూష తెలిపారు.
ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే జిల్లా క్రీడాకారులకు మెరుగైన శిక్షణ పొందేందుకు, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో మరిన్ని విజయాలు సాధించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కార్యాలయ సిబ్బంది బి. తిరుమల రావు, పులి లక్షయ్య, రైఫిల్ షూటింగ్ కోచ్ అబ్దుల్ నబి, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




