Manuguru: పాల్వంచలో బోల్తాపడిన సింగరేణి డీసీఎం వ్యాన్!
Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఇంద్ర కాలనీ వద్ద మణుగూరు సింగరేణి ఏరియా స్టోర్‌కు చెందిన డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఎవరికీ గాయాలు కాలేదు.
Manuguru: పాల్వంచలో బోల్తాపడిన సింగరేణి డీసీఎం వ్యాన్!
మణుగూరు: మణుగూరు ఏరియా స్టోర్‌కు చెందిన డీసీఎం వ్యాన్ (TS 28 TB 2165) సోమవారం సత్తుపల్లి నుంచి మెటీరియల్స్‌తో తిరిగి వస్తుండగా పాల్వంచ ఇంద్ర కాలనీ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.
వాహనంలోని వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం తెలుసుకున్న టీబీజీకేఎస్ మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాగెళ్లి అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.




