Pinapaka: విప్పలగుంపు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే!

Pinapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం విప్పలగుంపులో జరిగిన శ్రీ నాగులమ్మ, శ్రీదేవి, సారలమ్మ కార్తీక పౌర్ణమి మహోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 25 Nov 2026 11:17 AM IST
Pinapaka
X

Pinapaka: విప్పలగుంపు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే!

పినపాక: పినపాక మండలం విప్పలగుంపు గ్రామంలో నిర్వహించిన శ్రీ నాగులమ్మ, శ్రీదేవి, సారలమ్మ కార్తీక పౌర్ణమి మహోత్సవ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. కార్తీక పౌర్ణమి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో భక్తి భావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పేరం వెంకటేశ్వర్లు, బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ తొలేం కళ్యాణి, డైరెక్టర్ లు, ఆత్మా కమిటీ సభ్యులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA