Kothagudem: భద్రాద్రి జిల్లాలో పోలీస్ మెగా అవగాహన సదస్సులు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు జరిగాయి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 7 Jun 2026 8:18 AM IST
Kothagudem
X

Kothagudem: భద్రాద్రి జిల్లాలో పోలీస్ మెగా అవగాహన సదస్సులు!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగభూపాలెం, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 ఇంక్లైన్, 3 ఇంక్లైన్, ప్రశాంతినగర్, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుండెపూడి, ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింగిరెడ్డిపల్లి, పాత రెడ్డిపాలెం మరియు మణుగూరు మునిసిపాలిటీ, భద్రాచలం గ్రామపంచాయతీలలో గ్రామసభలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజలకు మహిళల భద్రత, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, మహిళలకు సంబంధించిన చట్టాలు మరియు సెక్షన్లు, మహిళల సంక్షేమ పథకాలు, పోక్సో చట్టం, షీ బాక్స్ వినియోగం, టి సేఫ్ వినియోగం, షీ టీమ్స్ మరియు భరోసా సెంటర్లో పాత్ర, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలు పట్ల, రోడ్డు భద్రత మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడం జరిగింది.

అత్యవసర పరిస్థితిలలో చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు మహిళా భద్రత విభాగం హెల్ప్ లైన్ నెంబర్ 181, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, అత్యవసర సేవల నెంబర్ 112 లపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, అంగన్వాడి టీచర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story