Palvancha: భద్రాద్రి జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు - ములకలపల్లిలో 197 మి.మీ.

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోత వర్షాలు. ములకలపల్లిలో అత్యధికంగా 197 మి.మీ. వర్షపాతం నమోదు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారుల హెచ్చరిక.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 4 Nov 2026 10:30 AM IST
Palvancha
X

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది.

TGDPS వాతావరణ సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా ములకలపల్లి మండల కేంద్రంలో 197 మి.మీ. వర్షపాతం నమోదైంది. దమ్మపేట మండలం నాయుడుపేటలో 191.8 మి.మీ., మల్కారంలో 165.8 మి.మీ., మండలపల్లిలో 165 మి.మీ., నాగుపల్లిలో 160 మి.మీ. వర్షం కురిసింది. అశ్వారావుపేటలో 147.8 మి.మీ., అంకంపాలెంలో 146.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ఇక పాల్వంచ మండలం సీతారాంపట్నంలో 120 మి.మీ., కొత్తగూడెం ఓల్డ్ కొత్తగూడెంలో 118 మి.మీ., బూర్గంపాడులో 117.5 మి.మీ., చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో 116 మి.మీ. వర్షం కురిసింది. లక్ష్మీదేవిపల్లిలో 107.3 మి.మీ., భద్రాచలం గోదావరి బ్యాంక్ వద్ద 104 మి.మీ., సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 102 మి.మీ. వర్షపాతం నమోదైంది.

అదేవిధంగా జూలూరుపాడులో 90 మి.మీ., సుజాతనగర్‌లో 88 మి.మీ., పాల్వంచ మండలం యానాంబైలులో 82.3 మి.మీ. వర్షం కురిసింది. మరోవైపు వర్షాల ప్రభావంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 21 నుంచి 22 డిగ్రీల మధ్య, గరిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. కరకగూడెంలో అత్యల్పంగా 1 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది.

భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN