Kothagudem: కొత్తగూడెం సబ్ డివిజన్‌లో ఏకకాలంలో పోలీసుల నాకాబందీ తనిఖీలు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ, లాడ్జిల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 20 Nov 2026 10:17 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం సబ్ డివిజన్‌లో ఏకకాలంలో పోలీసుల నాకాబందీ తనిఖీలు!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గురువారం సాయంత్రం నుంచి ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా నాకాబందీ తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అదేవిధంగా కొత్తగూడెం పట్టణంలోని పలు లాడ్జిలను కూడా పోలీసులు తనిఖీ చేశారు. లాడ్జిల్లో బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. ప్రతి ఒక్కరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు బస చేసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లాడ్జి యజమానులకు సూచించారు. పోలీసుల తనిఖీలకు సహకరించాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను తనిఖీ చేయడం ఈ ప్రత్యేక నాకాబందీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు.

తనిఖీల సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM