Kothagudem: వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ!
Kothagudem: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు, యువ నాయకుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలను కొత్తగూడెం నియోజకవర్గవ్యాప్తంగా అభిమానులు ఘనంగా నిర్వహించారు.
Kothagudem: వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ!
కొత్తగూడెం: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు, యువ నాయకుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కొత్తగూడెం నియోజకవర్గవ్యాప్తంగా అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. వనమా కుటుంబ అభిమానులు, వనమా రాఘవన్న అభిమానులు పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి జన్మదిన వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వనమా రాఘవేంద్రరావుకు అభిమానులు, అనుచరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
నియోజకవర్గవ్యాప్తంగా అభిమానులు స్వచ్ఛందంగా నిర్వహించిన ఈ వేడుకలతో పలు ప్రాంతాల్లో సందడి నెలకొంది. వనమా కుటుంబంపై అభిమానులు, అనుచరుల్లో ఉన్న అభిమానానికి ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.




