Yellandu: ఆవేశంతో కాదు ఆధారంతో వార్తలు రాయాలి: ఇల్లందు అధికారులు!
Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నూతన ప్రెస్ క్లబ్, ఐడీ కార్డులను డీఎస్పీ వెంకన్న బాబు, తహసీల్దార్ షా ఖాసీం, సింగరేణి జీఎం ఈసం కృష్ణయ్య ప్రారంభించారు.
Yellandu: ఆవేశంతో కాదు ఆధారంతో వార్తలు రాయాలి: ఇల్లందు అధికారులు!
ఇల్లందు: ఆవేశoతో కాకుండా ఆధారంతో వార్తలు రాయాలని, జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేయాలని వివక్షతలకు తావు లేకుండా వార్తలు అందించాలి, వేగం కన్నా వాస్తవిక దృక్పథంతో వార్తలను సేకరించాలని ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు, తాసిల్దార్ షా కాసిం, సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఈసం కృష్ణయ్య అన్నారు.
బుధవారం ఇల్లందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం,నూతన ప్రెస్ క్లబ్ కార్డును ఇల్లందు డిఎస్పి వెంకన్నబాబు, ఇల్లందు తాసిల్దార్ షా ఖాసిం, సింగరేణి ఇల్లందు ఏరియా జిఎం ఈసం కృష్ణయ్య ఇల్లందు, టేకులపల్లి పోలీస్ సిఐలు తాటిపాముల సురేష్, బత్తుల సత్యనారాయణ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అడ్మినిస్ట్రేషన్, పోలీస్, న్యాయ, మీడియా వ్యవస్థలు నాలుగు పిల్లర్లు లాంటివని, వాటిలో మూడు వ్యవస్థలు దారి తప్పుతున్నప్పుడు వాటిని నిలబెట్టే శక్తి ఒక మీడియా వ్యవస్థకే ఉందని, అటువంటి మీడియా వ్యవస్థ దారి తప్పద్దని వారు ఆకాంక్షించారు.
నేడు ఆధునిక పోకడలు మూలంగా జర్నలిజం దారి తప్పుతున్నదని,సోషల్ మీడియా పేరుతో పెడ ధోరణులు ఎక్కువ అవుతున్నాయని ప్రధాన మీడియా వాటిని సరిచేయాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు గడ్డం వెంకటేశ్వర్లు, బండి రామారావు, గౌరవాధ్యక్షులు సంఘం వేణుగోపాల్,
జర్నలిస్టులు కొత్త వెంకటేశ్వర్లు (కె.వి), శని గరపు రాజేష్, తిరుమల దేవి రెడ్డి,మాదాసు నర్సి, దుద్దుకూరి సుమంత్ గుడివాడ శ్రీనివాస్, కసువోజుల రాజు, సు ర్ణపాక శోభన్ బాబు, దాస్యం సురేంద్రబాబు, లంజపల్లి శ్రీనివాస్, తంగేళ్లపల్లి శ్రీనివాస్ చారి, కొర్లపాటి శివ కిరణ్, పెండకట్ల సంపత్ కుమార్ మాలోత్ భరత్, రాయల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.




