Aswapuram: గుల్లమడుగు గిరిజన గ్రామంలో చిన్నారులకు కొత్త బట్టలు పంపిణీ

Aswapuram: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గుల్లమడుగులో లిటిల్ కాజ్ ఎన్జీవో ఆధ్వర్యంలో 60 మంది నిరుపేద ఆదివాసి చిన్నారులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 13 Nov 2026 3:43 PM IST
Aswapuram
X

Aswapuram: గుల్లమడుగు గిరిజన గ్రామంలో చిన్నారులకు కొత్త బట్టలు పంపిణీ

అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మారుమూల వలస ఆదివాసి గ్రామమైన గుల్లమడుగులో లిటిల్ కాజ్ ఎన్జీవో ఆధ్వర్యంలో 60 మంది చిన్నారులకు ఉచితంగా నూతన దుస్తులు పంపిణీ చేశారు.

మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మంది చిన్నారులకు నూతన దుస్తులు అందజేసి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు.

ఈ సందర్భంగా లిటిల్ కాజ్ ఎన్జీవో డైరెక్టర్ నిదానపల్లి ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలోని నిరుపేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు అండగా నిలవడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని చిన్నారుల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లిటిల్ కాజ్ ఎన్జీవో డైరెక్టర్ నిదానపల్లి ప్రసాద్, సంస్థ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మారుమూల ఆదివాసి గ్రామంలో చిన్నారులకు దుస్తులు అందజేసిన ఎన్జీవో సేవలకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA