Bhadradri: అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీలు
Bhadradri: అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ రోహిత్ రాజు వార్షిక తనిఖీలు. రికార్డుల పరిశీలన, పెండింగ్ కేసుల వేగవంతమైన అమలుపై అధికారులకు ఆదేశాలు.
Bhadradri: అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీలు
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, నేరాల నమోదు తీరు, ఫిర్యాదుల రిజిస్టర్లు, పెండింగ్ కేసుల వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నిబద్ధతతో, పకడ్బందీగా అప్‌డేట్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
స్టేషన్ పరిసరాలతో పాటు మౌలిక వసతులను పరిశీలించిన ఎస్పీ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అత్యంత స్పందనతో వ్యవహరించాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని హెచ్చరించారు. మండలంలో రాత్రివేళ గస్తీని ముమ్మరం చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను వేగంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఎస్సై విజయ్ సింహారెడ్డి, ఏఎస్ఐ పెంటయ్య, హెచ్‌సీ దామోదర్, కృష్ణమోహన్ పీసీ జాన్ పాషా, సలీమ్‌పాషా, సురేష్, కృష్ణారావు , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




