Kothagudem: కొత్తగూడెం రైల్వే ఏవోగా కులకర్ణి సుభాష్ బాధ్యతలు!
Kothagudem: కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి, గోదావరి పుష్కరాల నాటికి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని DRUCC మెంబర్ డిమాండ్.
Kothagudem: కొత్తగూడెం రైల్వే ఏవోగా కులకర్ణి సుభాష్ బాధ్యతలు!
Kothagudem: కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు తక్షణం పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ DRUCC మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ కొత్తగూడెం ఏరియాకు ఏరియా ఆఫీసర్ గా ఐఆర్ఎస్ మహారాష్ట్ర కేడర్ కు చెందిన కులకర్ణి సుభాష్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు DRUCC మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు గత నాలుగు సంవత్సరాలుగా నత్తనడక నడుస్తున్నాయని, తక్షణమే పనులు పూర్తి చేసి రానున్న గోదావరి పుష్కరాల నాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు, ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కరోనాలో రద్దు అయిన కొత్తగూడెం టు కాజీపేట, కొత్తగూడెం టు డోర్నకల్, కొల్హాపూర్ - బెల్గావి ఎక్స్‌ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలని విన్నవించారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత భక్తులు కోరుతున్న తిరుపతి, శిరిడీ తదితర ప్రాంతాలకు నూతన రైళ్లను ప్రవేశపెట్టాలని, ప్లాట్‌ఫారంలపై మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.




