Yedulapuram: ఏదులాపురంలో సీపీఐకి షాక్.. కాంగ్రెస్‌లోకి ఏఐవైఎఫ్ నేతలు!
Yedulapuram: ఏదులాపురంలో సీపీఐకి భారీ షాక్ కాంగ్రెస్‌లో చేరిన ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ నేతలు మిర్యాల నరుణ్ తేజ్, రెబ్బగొండ్ల గోపీ మంత్రి పొంగులేటి సమక్షంలో చేరికలు.
Yedulapuram: ఏదులాపురంలో సీపీఐకి షాక్.. కాంగ్రెస్‌లోకి ఏఐవైఎఫ్ నేతలు!
ఏదులాపురం: ఏదులాపురం మున్సిపాలిటీలో సీపీఐకి భారీ షాక్ తగిలింది. సీపీఐ అనుబంధ ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మిర్యాల నరుణ్ తేజ్, రెబ్బగొండ్ల గోపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వరంగల్ క్రాస్ రోడ్డు 28వ వార్డుకు చెందిన గోపీ, 29వ వార్డు కు చెందిన నరుణ్ తేజ్ లు ఈ మేరకు సీపీఐ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు 28వ వార్డు కు చెందిన రంగిశెట్టి ఉదయ్, మాతంగి వినోద్, 32వ వార్డుకు చెందిన దారావత్ భాస్కర్, దారావత్ జాను, భూక్యా రవి, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నూతనంగా కాంగ్రెస్‌లో చేరిన వారు మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం శ్రీనన్నతోనే సాధ్యమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. ఈ చేరికలతో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
ఈ నెల 28న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు రోజు సందర్బంగా వరంగల్ క్రాస్ రోడ్డు, ఏదులాపురం నుంచి భారీ ఎత్తున సీపీఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరనున్న సందర్బంగా బైక్ ర్యాలీ, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఏదులాపురం మున్సిపాలిటీ నాయకులు తెలిపారు.




