Sadashivunipalem: రోడ్డుపై ధాన్యం ఆరబోత: బైకర్ మృతి, కేసు నమోదు

Sadashivunipalem: సదాశివునిపాలెంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పను ఢీకొని రాంబాబు మృతి చెందగా, ధాన్యం యజమానులు ఇద్దరిపై సత్తుపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 2 Nov 2026 10:47 PM IST
Sadashivunipalem
X

Sadashivunipalem: రోడ్డుపై ధాన్యం ఆరబోత: బైకర్ మృతి, కేసు నమోదు

Sadashivunipalem: తేదీ: 01.11.2026 న సదాశివునిపాలెం గ్రామములొ రోడ్డుపై సదాశివపాలెం గ్రామానికి చెందిన 1) గాయం. రాము, 2) చాట్ల. లక్ష్మి అనువ్యక్తులు ప్రభుత్వ రహదారి పైన వరి ధాన్యం ఆరబోయడంతో అటుగా మోటార్ సైకిల్ పై వస్తున్న తుంబూరు కు చెందిన తురకా రాంబాబు అను వ్యక్తి అట్టి ధాన్యం కుప్పకు గుద్దుకుని అట్టి ధాన్యం కుప్పలను ఎక్కించి రోడ్డుపై పడి తలకు బలమైన గాయాలతో అక్కడికక్కడే చనిపోయినాడు.

ఇట్టి సంఘటనకు సంబంధించి వచ్చిన దరఖాస్తు తో రోడ్డుపై ధాన్యం ఆరబోసి అట్టి ప్రమాదానికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు అయినది.

ఇట్టి రోడ్లపై ధాన్యం ఆరబోసే విషయములో ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా కొంతమంది రైతులు ప్రభుత్వ రహదారుల పైన ధాన్యం ఆరబోయడం మరియు అట్టి ధాన్యంపైకి వాహనాలు రాకుండా రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద రాళ్లు, ముళ్ల కంచెలు, కట్టెలు పెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.

కావున ఈ విధముగా ధాన్యం రోడ్లపై ఆరబెట్టి ప్రమాదాలకు కారణమైతే సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇట్టి విషయములో పూర్తి బాధ్యత ధాన్యం యజమానులదేనని హెచ్చరిస్తున్నారు.

రైతులు తమ పంటను రోడ్లపై కాకుండా ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలు (PPCs) లేదా గ్రామాల్లోని ప్రత్యామ్నాయ కల్లాలలో మాత్రమే ఆరబోసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI