Julurpadu: జూలూరుపాడులో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా 'తిరంగా యాత్ర'!

Julurpadu: జూలూరుపాడు కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 15 Aug 2026 7:30 AM IST
Julurpadu
X

Julurpadu: జూలూరుపాడులో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా 'తిరంగా యాత్ర'!

Julurpadu: కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో తిరంగా యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరుకుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించబడుతున్నాయి. ప్రజలందరూ కూడా దేశ సమైక్యతను కాపాడాలి. అందరిలోనూ దేశభక్తిని పెంపొందించుకోవాలి, మన దేశానికి స్వతంత్రం కోసం ఎంతోమంది నాయకులు ఉద్యమాలు పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని పారదోలినారు. వారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా దేశం కోసం పని చేయాలి భారతదేశంలో ఉన్న పౌరులందరూ ఐక్యంగా ఉంటే ఇతర దేశాల్లో మన గౌరవం పెంపొంది.

ఈ తిరంగా యాత్రలో రైతులు ఉపాధ్యాయులు,విద్యార్థులు ప్రజలు కిసాన్ మోర్చా నాయకులు తిరంగా యాత్రలో పాల్గొని దేశ సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న వారందరికీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ ధన్యవాదాలు తెలియజేసినారు.

కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆపద రామారావు కిసాన్ జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, చింతనిప్పు రామారావు బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్, సిరిపురపు ప్రసాద్ గారు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సిరిపరపు పుల్లారావు , దారావత్ బాలకిషన్ గోపాల్ రావు , భూక్య రాంబాబు , భూక్యచరణ్ , బాబూలాల్ , కిరణ్, కిసాన్ మోర్చా నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు రైతులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story