Julurupadu: జూలూరుపాడులో కాంగ్రెస్ ప్రభుత్వంపై చిలుకూరి రమేష్ ఫైర్!
Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో బీజేపీ నేత చిలుకూరి రమేష్ రేషన్ బియ్యం, హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Julurupadu: జూలూరుపాడులో కాంగ్రెస్ ప్రభుత్వంపై చిలుకూరి రమేష్ ఫైర్!
Julurupadu: జూలూరుపాడు లో బిజెపి మండల సమావేశంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకం కింద దేశంలో ప్రతి మనిషికి ఐదు కిలోలు రేషన్ బియ్యం లేదా గోధుమలు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నది.
భారతదేశంలో ఏ రాష్ట్రంకి అయినా వలస వెళ్లినా కూడా రేషన్ కార్డు మార్చకుండానే అదే నెంబర్‌తో భారతదేశంలో ఏ రేషన్ దుకాణంలో తీసుకున్న ఉచితంగా ప్రతి మనిషికి ఐదు కిలోలు చొప్పున వారి రేషన్ కార్డులు ఎంత మంది ఉంటే అంతమందికి రేషన్ బియ్యం గాని గోధుమ గాని తీసుకోవచ్చు, రాష్ట్రాలు అదనంగా బియ్యం ఇచ్చుకుంటే రాష్ట్రాలకు ఒక కేజీ బియ్యాన్ని మూడు రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది.
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డు పేరుమీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రి ఫోటో ముద్రించి ఇవ్వటం మరియు సన్న బియ్యం 6 కేజీలు మేమే ఇస్తున్నాము బిజెపి రాష్ట్రాలు ఇస్తున్నారని రాష్ట్ర మంత్రులు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో వాళ్ల ఆహార అలవాట్లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కొనుగోలు చేసిన ధాన్యానికి, మద్దతు ధర తో పాటు బస్తాలు, ట్రాన్స్పోర్ట్, వడ్లను బియంగా మార్చిన రైస్ మిల్లర్లకు, వడ్లు కొనుగోలు చేసినందుకు కమిషన్ పురుకోస్తో సహా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వములకు డబ్బులు ఇస్తున్నది.
ఉత్తర భారత దేశంలో గోధుమలు తింటారు, తమిళనాడులో బయల్చేసిన రైస్ తింటారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక కేజీ బియ్యం ఇచ్చి మొత్తం మేమే ఇస్తాను అని చెప్పడం దారుణం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులే అబద్దాలు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తాత్తో పాటు అవ్వ కూడ 4000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి, మూడేళ్లు గడుస్తున్నా కూడా 4000 పెన్షన్ ఇవ్వలేదు.
కొత్త పెన్షన్ రాష్ట్రంలో ఒక్క వృద్ధుడుకు కూడా ఇంతవరకు ఇవ్వలేదు, మహిళలకు 18సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానని, డిగ్రీ మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు. నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, వ్యవసాయ కూలీలకు,ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తానని,
దళితులకు 12 లక్షలు, గిరిజనులకు 10 లక్షలు ఇస్తానని ఏ ఒక్కరికి ఒక నయా పైసలు కూడా ఇవ్వలేదు, వడదెబ్బకు చనిపోయిన రైతులకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని ఏ ఒక్క రైతుకు ఇంతవరకు ఇవ్వలేదు, అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టపోయినప్పుడు నష్టపరహారం కొరకు కేంద్ర ప్రభుత్వం పసల బీమా పథకం ప్రవేశపెట్టినది.
కానీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయినారు. ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి చెందుతుంది అంటే 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నవి, కనీసం కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకొని మేమే ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు, మీ మేనిఫెస్టోలో 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి రైతులను, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసినది.
కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం వరకే తప్ప అమలు చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు, బిజెపి మండల అధ్యక్షులు భూక్య రమేష్, తెల్లం నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సిరిపురపు పుల్లారావు, ధరావత్ బాలకిషన్, గుగ్గులోత్ రాంబాబు, భూక్య రవి వందనపు సుబ్బు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.




