Khammam: ఘనంగా పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ జయంతి వర్ధంతి వేడుకలు!
Khammam: పాలేరు నియోజకవర్గంలో తెలంగాణ విమోచన దిన వారోత్సవాల సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ త్యాగాలను స్మరించి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ నేతలు
Khammam: ఖమ్మంలో ఘనంగా పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ జయంతి వర్ధంతి వేడుకలు!
Khammam: నిజాం పాలన, ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల దమనకాండకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జర్నలిజాన్ని ఆయుధంగా మలుచుకుని పోరాడి ప్రాణత్యాగం చేసిన ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ త్యాగాలను స్మరించుకుంటూబీజేపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దిన వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సుబ్లేడ్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజల కోసం కలాన్ని ఆయుధంగా మలిచి..
నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న నిర్బంధం, రజాకార్ల అకృత్యాలపై షోయబుల్లా ఖాన్ తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి బలిదానం చేసిన ఆయనను స్ఫూర్తిదాయక పాత్రికేయుడిగా కొనియాడారు.
జర్నలిజం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చని, అన్యాయాన్ని ప్రశ్నించేందుకు కలం కూడా శక్తిమంతమైన ఆయుధమేనని షోయబుల్లా ఖాన్ తన జీవితంతో నిరూపించారని వారు పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసిన ఆయన త్యాగాన్ని నేటితరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
విమోచన దిన వారోత్సవాల్లో కార్యక్రమం
తెలంగాణ విమోచన దిన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, భాజపా కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, రవికుమార్ నున్న, రాష్ట్ర నాయకుడు రుద్ర ప్రదీప్, శామ్ రాథోడ్, తక్కెళ్లపల్లి నరేంద్రరావు, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేకా సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పలువురు నాయకుల హాజరు
జిల్లా నాయకులు అనంతు ఉపేందర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, అనగాని రామారావు, మల్లారెడ్డి, మండల అధ్యక్షులు బొడ్డు ప్రసాద్, పాగర్తి సుధాకర్, పుణ్యవతి, సత్తి నాగరాజుతో పాటు పలువురు భాజపా నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షోయబుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ‘అమర్ హై’ అంటూ నినదించారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను నేటితరానికి తెలియజేయడంతో పాటు, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుల త్యాగాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.




