Manuguru: మణుగూరులో బీజేపీ పినపాక నియోజకవర్గ సేవ అభియాన్!
Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీజేపీ పినపాక నియోజకవర్గ స్థాయి సేవ అభియాన్ కార్యశాల జరిగింది.
Manuguru: మణుగూరులో బీజేపీ పినపాక నియోజకవర్గ సేవ అభియాన్!
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో, కిరాణా మర్చంట్ హాల్ నందు భారతీయ జనతా పార్టీ పినపాక నియోజకవర్గస్థాయి "సేవ అభియాన్ కార్యశాల" సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొడియం బాలరాజు పాల్గొన్నారు.
పట్టణ అధ్యక్షులు ఈసాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొడియం బాలరాజు గారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యంత్రిగా, భారత ప్రధానిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "సేవ అభియాన్" పేరుతో కార్యక్రమాలను సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నియోజకవర్గ స్థాయిలో ఘనంగా జరపాలని, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురష్కరించుకుని గ్రామ గ్రామాన జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని,
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకపోతు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ , పార్టీని బలోపేతం చేయుటకు గ్రామస్థాయి కార్యకర్త నుండి ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రతి కార్యకర్త సైనికుడి లాగా నిరంతరం శ్రమించి పినపాక గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ సమావేశంలో మండల అధ్యక్షులు పట్టాభిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం బిక్షపతి, మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ముస్కు శ్రీనివాసరెడ్డి, మాజి జిల్లా కార్యదర్శి ముత్యాల వెంకటేశ్వరరావు. జిల్లా కౌన్సిల్ మెంబెర్ లింగంపల్లి రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బీర రమేష్. మండల ప్రధాన కార్యదర్శి రవి గౌడ్. ఓబిసి జిల్లా కార్యదర్శి అన్న బత్తుల వెంకన్న, పినపాక మండల అధ్యక్షులు శివ ప్రసాద్, సీనియర్ నాయకులు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.




