Sathupalli: ప్రజల ప్రాణాలతో సింగరేణి చెలగాటం ఆపాలి: బీజేపీ!
Sathupalli: సత్తుపల్లి ఖమ్మం రోడ్డుపై సింగరేణి నిర్లక్ష్యం వీడాలి మట్టి, దుమ్ముతో నిత్య ప్రమాదాలు తక్షణమే సేఫ్టీ చర్యలు చేపట్టాలని బీజేపీ మండల అధ్యక్షుడు సాలి శివకృష్ణ డిమాండ్.
Sathupalli: ప్రజల ప్రాణాలతో సింగరేణి చెలగాటం ఆపాలి: బీజేపీ!
సత్తుపల్లి: సాలి శివకృష్ణ, బీజేపీ సత్తుపల్లి మండల అధ్యక్షులు ఎస్ కే రహమతుల్లా మైనార్టీ మోర్చా మరియు చీకటి వసంతరావు గారు జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడారు. సత్తుపల్లి ఖమ్మం ప్రధాన రహదారిపై సింగరేణి క్యాంపులు, వాహనాల రాకపోకల కారణంగా రోడ్డుపై పెద్ద ఎత్తున మట్టి, దుమ్ము పేరుకుపోతున్నప్పటికీ, రహదారి భద్రత విషయంలో సింగరేణి అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ వాహనాల రాకపోకలతో రోడ్డుపై మట్టి పేరుకుపోవడం వల్ల ద్విచక్ర వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని, దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాదు ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత అని అన్నారు.
సింగరేణి పరిధిలోని ఈ ప్రాంతంలో:
రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగించాలి. ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట బ్యారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలి. భారీ వాహనాల రాకపోకల ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలి. దుమ్ము నియంత్రణకు క్రమం తప్పకుండా నీటిని పిచికారీ చేయాలి. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక రోడ్ సేఫ్టీ చర్యలు చేపట్టాలి.
“ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ప్రకటించడం కంటే, ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యం.” అని సాలి శివకృష్ణ ప్రశ్నించారు.
సింగరేణి యాజమాన్యం, సంబంధిత రోడ్డు మరియు పోలీసు అధికారులు వెంటనే ఈ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యాన్ని బీజేపీ సహించదు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం.




