Kamareddy: రైతు గోస కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: అరుణ తార పిలుపు!

Kamareddy: రైతుల సమస్యలపై అక్టోబర్ 8న పెద్ద కొడప్‌గల్‌లో ‘రైతు గోస - బీజేపీ భరోసా’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే టి. అరుణ తార తెలిపారు.

VEERANNA, JUKKAL
Published on: 6 Oct 2026 7:09 PM IST
Kamareddy
X

Kamareddy: రైతు గోస కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: అరుణ తార పిలుపు!

కామారెడ్డి: రైతుల సమస్యల పరిస్కారమే లక్ష్యంగా ఈ నేల 8 న బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద కొడప్ గల్ మండల కేంద్రం లో రైతు గోస - బిజెపి భరోసా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జుక్కల్ మాజి ఎమ్మెల్యే టి. అరుణ తార ఓ ప్రకటన లో తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కరానికి కృషి చెయ్యాలనే లక్ష్యం తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సమయంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని గొప్పలు చెప్పి ప్రస్తుతం కేవలం 6 గంటలే ఇస్తుందని ఆరోపిస్తూ రైతుల పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టానున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమం లో జహీరాబాద్ మాజి ఎంపి బి బి పాటిల్, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు తోపాటు బిజెపి పార్టీ నాయకులు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గం లొని ప్రతి రైతు, రైతు సంఘాల నాయకులు,బిజెపి నాయకులు, జిల్లా ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, బూత్ కమిటి సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL