Khammam: హక్కులను గౌరవిస్తూ మన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిద్దామని పిలుపు!

Khammam: రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అందరం కలసికట్టుగా పనిచేద్దామని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 27 Nov 2026 11:37 AM IST
Khammam
X

Khammam: హక్కులను గౌరవిస్తూ మన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిద్దామని పిలుపు!

Khammam: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశం చేసిన పవిత్ర గ్రంథం మన భారత రాజ్యాంగం అని.సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలకు ప్రతీక మన రాజ్యాంగం.

భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను గౌరవిస్తూ, మన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిద్దాం.రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, సమానత్వం మరియు సామాజిక న్యాయం వెల్లివిరిసే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాం అని శ్రీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.