Enkoor: గ్రామ దీపికల కష్టాలు తీరాలి.. సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు!

Enkoor: ఏన్కూర్‌లో నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న గ్రామ దీపికలకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేతలు. వేతనాలు పెంచాలని డిమాండ్.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 26 May 2026 3:34 PM IST
Enkoor
X

Enkoor: గ్రామ దీపికల కష్టాలు తీరాలి.. సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు!

Enkoor: గ్రామ అభివృద్ధిలో పాటుపడే' గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న గ్రామీణ మహిళల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మహిళలన చైతన్యవంతం చేసే డ్వాక్రా సంఘాల గ్రామ దీపికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజుల నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దీక్షాశివరాన్ని ఏన్కూర్ మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం బీఆర్ఎస్ పార్టీ సందర్శించి వారి సమ్మెకు సంఘీభావం ప్రకటించడం జరిగింది

ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ అతి తక్కువ వేతనంతో పని చేస్తున్న గ్రామ దీపికల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు వైఖరిని అవలంబిస్తుందని వేతనాలు పెంచకపోవడంతో పాటు శ్రమదోపిడికి గురిచేస్తున్నారని వారి యొక్క శ్రమని దోసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వేలాదిమంది గ్రామ దీపికలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోవటం వారి శ్రమని గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆవేదన వ్యక్తం చేశారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలను పెంచాలని హెల్త్ పాలసీలు అమలు చేయాలని సీనియారిటీ ప్రాతిపదిక మీద సీనియర్ గ్రామ దీపికలను సీసీలుగా గుర్తించాలని హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలని గౌరవ వేతనం కాకుండా వారికి కనీస వేతనం 20000 మంజూరు చేయాలని గ్రామ దీపికలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గ్రామ దీపికల యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు తమ న్యాయమైన డిమాండ్లను అమలు అయ్యేంతవరకు ఉద్యమించాలని ఆ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతును సంఘీభావాన్ని తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు గిద్దగిరి సత్యనారాయణ, ఇంజం దేవదాసు, భూక్యా ధర్మ నాయక్, భూక్యా వినోద్ కుమార్, షేక్ బాజీ, గూగులోత్ మజిలాల్, రాచబంటి వీరభద్రం, కడియాల సుధాకర్, బానోత్ రమేష్ మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story