Bhadrachalam: రాబోయేది తెలంగాణ ప్రభుత్వమే బీఆర్ఎస్ నాయకుడు మానే రామకృష్ణ!
Bhadrachalam: భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలం గుంపెనగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించి, రాబోయేది మన ప్రభుత్వమేనని నాయకుడు మానే రామకృష్ణ అన్నారు.
Bhadrachalam: రాబోయేది తెలంగాణ ప్రభుత్వమే బీఆర్ఎస్ నాయకుడు మానే రామకృష్ణ!
Bhadrachalam: బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ చర్ల మండలం గుంపెనగూడెం గ్రామంలో వార్డ్ మెంబర్ బంటు వెంకటేశ్వరరావు అధ్యక్షతన మండల నాయకులు మెంతుల నాగరాజు గఇంటి వద్ద బిఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో మానే రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన నడుస్తుందని రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారని రాబోయేది మన ప్రభుత్వమేనని మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ఎన్నికలు ఏవైనా పార్టీ గెలుపు కొరకు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ నాయకులు గుంపెనగూడెం బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




