Khammam: ఖమ్మంలో మేడే సంబరాలు.. జెండా ఆవిష్కరించిన పువ్వాడ అజయ్

Khammam: ఖమ్మం రైతు బజార్ ఆటో అడ్డా వద్ద మేడే వేడుకల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

M RAVIKIRAN
Published on: 1 May 2026 1:24 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో మేడే సంబరాలు.. జెండా ఆవిష్కరించిన పువ్వాడ అజయ్

ఖమ్మం: కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.. కార్మికుల పక్షపాతి కేసీఆర్..మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం రైతు బజార్ ఆటో అడ్డా నందు మేడే సందర్బంగా BRTU నాయకులు పాషా,సత్తార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన BRTU జెండాను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో కష్టపడి అన్ని దేశాలలో లక్షలాదిగా కార్మికులు ఉద్యమాలు చేసి సాధించుకున్నది మేడే అని తెలిపారు.

అనేక రంగాల్లో కార్మికులు తన చమటను చిందించి పని చేస్తున్నారని దేశం,రాష్ట్ర, మానవ ప్రగతికి కార్మికులు ఎంత ముఖ్యమని కార్మికులు పనిచేయటం ఆపేస్తే మొత్తం ప్రపంచం స్తంభిస్తుందని అన్నారు. కార్మికుల త్యాగాలు, వాళ్ళ కష్టాన్ని యావత్ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది..బీఆర్ఎస్ హయాంలో కెసిఆర్ పదేళ్ల పాలనలో కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కు శ్రీకారం చుట్టారు.కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక విధాలుగా ఆదుకున్నాం.

కార్మికుడు పొరపాటున చనిపోతే, గాయపడితే పిల్లల చదువు, పెళ్లిళ్లకి ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా సహాయం అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రామికులు,కష్టజీవుల కష్టాలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు పేదవాళ్ల గురించి పట్టించుకునే ప్రభుత్వం కాదు అని ఏద్దేవా చేశారు. కార్మికుల పక్షాన నిలవాల్సిన అవసరం ఉంది కార్మికుల పక్షాన అండగా ఉండేందుకు బీఆర్టియు సిద్ధంగా ఉండాలి. బీఆర్టియు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలి కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుంది అని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం. నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు,కార్పొరేటర్ జ్యోతి రెడ్డి,బిక్కసాని జస్వంత్,మాజీ గ్రంధాలయం చైర్మన్ ఖమర్, మాజీ మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, మాజీ డిప్యుటీ మేయర్ బత్తుల మురళి, నాయకులు దడాల రఘు, ఎర్రా అప్పారావు, గొల్లపుడి రాంప్రసాద్, పాలడుగు పాపారావు, కనకం భద్రయ్య, షకీనా, గార్లపాటి సంతోష్, గాదె అనిల్, మాటేటి కిరణ్, ఆరెంపుల వీరభద్రం, కోటేశ్వరరావు, ఉస్మాన్, బిక్షం, మాధవి, శైలజ, వెంకట్, జానీ, నగేష్, తిరుమల్, సాగర్, శివ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

M RAVIKIRAN

M RAVIKIRAN

Next Story