Ashwaraopeta: అశ్వారావుపేటలో మార్నింగ్ వాకర్స్‌తో బీఆర్ఎస్ మాటామంతి
Ashwaraopeta: అశ్వారావుపేట మున్సిపాలిటీలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ ఓటు నమోదు, రాకేష్ రెడ్డికి మద్దతుపై ప్రచారం చేశారు.
Ashwaraopeta: అశ్వారావుపేటలో మార్నింగ్ వాకర్స్‌తో బీఆర్ఎస్ మాటామంతి
అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఉదయం మార్నింగ్ వాకర్స్ నీ కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తక్కినపల్లి రవీందర్ గారు, ఉప్పల వెంకటర మణ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్ లో భాగంగా 2023 అక్టోబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్క పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటును ఎన్రోల్మెంట్ చేపించుకోవాల్సిందిగా కోరారు.
అలాగే అశ్వారావుపేటలో కెసిఆర్ గారి సారధ్యంలో మెచ్చా నాగేశ్వరరావు గారి నాయకత్వం జరిగిన అభివృద్ధిని వారికి తెలియపరిచారు.అలాగే రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి తమ మద్దతును ఇవ్వాలని కోరారు.2028 లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మన కేసీఆర్ గారి సారధ్యంలో అశ్వారావుపేట నీ మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు అశ్వారావుపేట బి ఆర్ ఎస్ పార్టీ మండల కో ఆర్డినేటర్ జూపల్లి.రమణ రావు,మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక.ప్రసాద్, మండల నాయకులు మందపాటి.మోహన్ రెడ్డి, రావు జోగేశ్వరరావు, కలపాల సురేష్, మాజీ సర్పంచ్ సాధు జ్యోత్స్నభాయ్, ఉస్మాన్, రెహ్మాన్ ఉస్మాన్,బన్ను,తదితరులు పాల్గొన్నారు.




