Khammam: తెలంగాణ భవన్‌లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి!
Khammam: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Khammam: తెలంగాణ భవన్‌లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి!
Khammam: భారతదేశంలో కుల వ్యవస్థ, అంటరానితనాన్ని నిర్మూలించి, బహుజన, అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య కోసం జీవితాంతం పోరాడిన సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్‌లో మహాత్మా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో కేసీఆర్ పాలన సాగిందని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక చారిత్రాత్మక పథకాలను అమలు చేశామని నాయకులు గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, బొమ్మెర రామ్మూర్తి, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, బోజెడ్ల రామ్మోహన్, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, మేదరమెట్ల శ్రీనివాస్, పిడమర్తి రామ్మూర్తి, ఈదుల రాజేష్, షారుక్, అజయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




