Pinapaka: పోలింగ్ కేంద్రాల మార్పుపై రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ వినతి!

Pinapaka: పిరపాక నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై రిటర్నింగ్ అధికారి రాహుల్‌కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.

RAVI, BURGAMPAD AREA
Published on: 5 Aug 2026 12:03 PM IST
Pinapaka
X

Pinapaka: పోలింగ్ కేంద్రాల మార్పుపై రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ వినతి!

Pinapaka: పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ కొరకు.. రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు.

SIR 2026 లో భాగంగా..ఆగస్టు 10వ తేదీ లోపు.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో.. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ (Rationalization) మరియు పునర్వ్యవస్థీకరణ (Re-arrangement) ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన నేపథ్యంలో వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు.

సారపాక,తాళ్ళగోమ్మూరు,కోయగూడెం.. గ్రామపంచాయతీలలోని పలువురు ఓటర్లు తమ ప్రాంతంలో అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రాలలో కాకుండా.. దూరంగా ఉన్న మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవలసి వస్తుంది.

కావున వృద్ధులు,దివ్యాంగులు,ఇతర ఓటర్లు దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా..ఓటర్లకు సౌకర్యవంతంగా.. ఆయా ప్రాంతాల సమీపంలో.. ఇప్పటికే ఉన్న పోలింగ్ కేంద్రాల్లోకి ... పోలింగ్ బూత్ లను మార్చాలని..

ఐటిడిఓ పిఓ మరియు పినపాక నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రాహుల్ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు జలగం జగదీష్.. కొనకంచి శ్రీనివాసరావు..తుపాకుల రవి.. తిరుపతి ఏసోబు.. సోము లక్ష్మీ చైతన్య రెడ్డి చల్లకోటి పూర్ణచంద్రరావు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA

Next Story