Kothagudem: బాధితుడికి 20 లక్షల సాయం అందించాలి బీఆర్ఎస్ నేతల డిమాండ్!

Kothagudem: మంత్రుల పర్యటన ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ ఘాతానికి గురైన బాలాజీ ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమాని సంతోష్‌ను కొత్తగూడెం ఆస్పత్రిలో బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 16 July 2026 11:18 PM IST
Kothagudem
X

Kothagudem: బాధితుడికి 20 లక్షల సాయం అందించాలి బీఆర్ఎస్ నేతల డిమాండ్!

కొత్తగూడెం: మంత్రుల పర్యటన సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ మణుగూరులో,విద్యుత్ ఘాతానికి గురై కొత్తగూడెం నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమాని

సంతోష్ ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు.సంతోష్ ను ప్రభుత్వం ఆదుకోవాలి,పూర్తిగా కోలుకునే వరకు కార్పొరేట్ వైద్య సహాయాన్ని అందించాలి.20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రులు అందించాలి.

బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు డిమాండ్ చేసిన బిఆర్ఎస్ నాయకులు.మంత్రుల పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ గురై తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానిని జిల్లా బిఆర్ఎస్ నాయకులు కొత్తగూడెంలోని నాగరాజు ఆస్పత్రిలో పరామర్శించారు.ఆయనకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే మంత్రుల పర్యటన సందర్భంగా జిల్లాలో పలుచోట్ల మంత్రులకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలోమణుగూరు నియోజకవర్గంలోని ఏడూళ్ళబయ్యారం క్రాస్ రోడ్ లోని బాలాజీ ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమాని సంతోష్ మణుగూరులో మంత్రుల కోసం స్వాగత ఫ్లెక్సీలు కట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు గుట్ట మల్లారం తీసుకుని వచ్చిన నేపథ్యంలో విద్యుత్ ఘాతానికి గురై తీవ్ర గాయాల పాలై కిందపడ్డాడు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ,కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.

108కు సమాచారం అందించి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.24 గంటలు గడిచినా గాని కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు.ఈ నేపథ్యంలోనే భద్రాచలం నుండి మెరుగైన అత్యవసర చికిత్స నిమిత్తం కొత్తగూడెంలోని గాయత్రి ఆసుపత్రికి తరలించి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు.బాధితుడిని పరామర్శించిన వారిలో బిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్,

7వ డివిజన్ కార్పొరేటర్ సింధు తపస్వి, చుంచుపల్లి మాజీ మండల అధ్యక్షులు రాజేష్ మైనారిటీ నాయకులు మునీర్, మాజీ యూత్ ప్రెసిడెంట్ పోతురాజు రవి, 55వ డివిజన్ ఇన్చార్జి ఇమంది గణేష్ , జావీద్ ⁠రిజ్వాన్, అఖిల్, షారుక్ తదితరులు సందర్శించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story