Yellandu: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు లోపాలపై ఎమ్మెల్సీ రవీందర్ అసంతృప్తి!

Yellandu: ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆన్‌లైన్ నమోదులో లోపాలపై ఖమ్మం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్.

SHOBAN BABU, YELLANDU
Published on: 13 Oct 2026 12:02 PM IST
Yellandu
X

Yellandu: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు లోపాలపై ఎమ్మెల్సీ రవీందర్ అసంతృప్తి!

Yellandu: ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కోసం పట్టా బద్రులైన అర్హులు ఆన్లైన్లో ఎన్నిసార్లైనా ఓటు నమోదు చేసుకునే సౌకర్యం ఉండటాన్ని తాను ఖమ్మం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఓటు నమోదు తీరును పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గాల్లో పలుమార్లు పట్టా బద్రుల ఓటు ఓటరుగా నమోదు అవుతుందని దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పారన్నారు. పార్టీ బాధ్యతలు కూడా ఓటు నమోదు చేసేందుకు యత్నాలలో అనేకమార్లు ఓటు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU