Bhadradri Kothagudem: రికార్డు సృష్టించిన బూర్గంపాడు CHC.. ఏడాదిలోనే 100 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విజయవంతం!
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) పునరుద్ధరించబడిన ఆపరేషన్ థియేటర్ లో ఏడాది వ్యవధిలో 100 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
Bhadradri Kothagudem: రికార్డు సృష్టించిన బూర్గంపాడు CHC.. ఏడాదిలోనే 100 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విజయవంతం!
బూర్గంపాడు: సుదీర్ఘ కాలంగా ఆపరేషన్ థియేటర్ లేక ఇబ్బందులు పడ్డ బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) ఇప్పుడు రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఆపరేషన్ థియేటర్ పునరుద్ధరణ జరిగిన ఏడాది వ్యవధిలోనే వంద కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన రికార్డు సాధించింది.
తిరిగి పుంజుకున్న వైద్య సేవలు
దాదాపు 15 ఏళ్లుగా ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో ఈ ఆసుపత్రి కేవలం ప్రాథమిక వైద్య సేవలకు మాత్రమే పరిమితమైంది. అయితే,అప్పటి కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పాత ఆపరేషన్ థియేటర్‌ను ఆధునీకరించి, అత్యాధునిక పరికరాలను సమకూర్చారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచనల మేరకు, డీసీహెచ్ఎస్ రవిబాబు ప్రత్యేక చొరవ తీసుకుని గైనకాలజిస్ట్‌ను నియమించడంతో స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఈ విజయం వెనుక ఆసుపత్రి సిబ్బంది కృషి ఎంతో ఉందని అధికారులు పేర్కొన్నారు.సీహెచ్‌సీ సూపరింటెండెంట్, శిశు వైద్య నిపుణులు డాక్టర్ ముక్కంటేశ్వరరావు పర్యవేక్షణలో, గైనకాలజిస్ట్ డాక్టర్ అనూష లక్ష్మి ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిగాయి.ఆపరేషన్ థియేటర్ ఇంచార్జ్ నర్సింగ్ అధికారిణి పద్మతో పాటు జ్యోతి, కరుణశ్రీ, అనురాధ, రాజకుమారి, అనూష, నీలమ్మ,కవిత తదితర సిబ్బంది 24 గంటల పాటు రోగులకు నిరంతర సేవలు అందిస్తూ ప్రజల్లో ఆసుపత్రిపై విశ్వాసాన్ని పెంచారు.




