Burgampadu: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Burgampadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

G Ravi, Bhadradri
Published on: 17 Jun 2026 8:39 AM IST
Burgampadu
X

Burgampadu: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Burgampadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పల్లె ప్రకృతి వనం సమీపంలో మంగళవారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన తనిఖీలలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.

ఒడిశా రాష్ట్రం నుండి ములుగు జిల్లా మంగపేట మండలానికి బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌పై గంజాయిని తరలిస్తుండగా, బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన వ్యక్తుల వద్ద నుండి సుమారు రూ.1,05,000 విలువైన 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి తరలిస్తున్న బడే భరత్ (20 సంవత్సరాలు) ఉప్పరపల్లి వెంకటేష్ (26 సంవత్సరాలు) వీరు మంగపేట మండలం, ములుగు జిల్లా నిందితుల వద్ద నుంచి 2.1 కిలోల గంజాయి ,బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్,2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story