Manuguru: పినపాక ఎమ్మెల్యే పాయంను కలిసిన బూర్గంపాడు మార్కెట్ చైర్మన్ కళ్యాణి!
Manuguru: మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసిన బూర్గంపాడు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ తోలెం కళ్యాణి. రైతుల సంక్షేమానికి కృషి చేయాలని సూచన.
Manuguru: పినపాక ఎమ్మెల్యే పాయంను కలిసిన బూర్గంపాడు మార్కెట్ చైర్మన్ కళ్యాణి!
Manuguru: బూర్గంపాడు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తోలెం కళ్యాణి బుధవారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం నూతన బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ తోలెం కళ్యాణి ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తోలెం కళ్యాణి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిని శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తోలెం కళ్యాణి గారికి నూతన బాధ్యతల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.




