Burgampahad: గాలి బీభత్సం.. మొరంపల్లి బంజర్‌లో నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు!

Burgampahad: బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్‌లో ఈదురు గాలుల బీభత్సం: నేలకూలిన భారీ వృక్షాలు, విరిగిన విద్యుత్ స్తంభాలు. నిలిచిన విద్యుత్ సరఫరా, బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి.

RAVI, BURGAMPAD AREA
Published on: 23 Sept 2026 7:07 PM IST
Burgampahad
X

Burgampahad: గాలి బీభత్సం.. మొరంపల్లి బంజర్‌లో నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు!

బూర్గంపాడు: బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్ గ్రామంలో బుధవారం వీచిన బలమైన గాలులకు బీభత్సం నెలకొంది. భారీ చెట్లు నేలకూలి ఇళ్లపై పడటంతో నష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడి, తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

తెగిపడిన విద్యుత్ తీగలతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో పాటు నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA