Burgampahad: ఫారెస్ట్ ఆఫీసర్ మృతికి కారణమైన నలుగురి అరెస్ట్!
Burgampahad: విద్యుత్ షాక్‌తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన బూర్గంపాడు పోలీసులు. కోర్టుకు తరలింపు.
Burgampahad: ఫారెస్ట్ ఆఫీసర్ మృతికి కారణమైన నలుగురి అరెస్ట్!
Burgampahad: విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు.
తేదీ 11.8.2026న రాత్రి నకిరేపేట అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా అడవి జంతువులను విద్యుత్ షాక్ తో చంపడానికి వైర్లను అమర్చినారని సమాచారం రాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ మరియు తన DRO, తోటి సిబ్బందితో కలిసి ప్రదేశానికి వెళ్లి, అట్టి వ్యక్తుల గురించి వెతుకుతుండగా అట్టి విద్యుత్ వైర్ తగిలి షాక్ తో నవీన్ మృతి చెందగా, డిఆర్ఓ అనార్కలి గారి ఫిర్యాదు మేరకు ఇట్టి నవీన్ మృతికి కారకులైన ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
అటవీ జంతువులను వేటాడటానికి అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు లక్ష్మిపురం గ్రామంలోని ఆవుల నాగిరెడ్డి ఇంట్లో అతనితో పాటు దాసరి నరేష్,తాటి వీరబాబు లను ఉన్నారనే సమాచారంతో పోలీసులు వెళ్ళగా పారిపోతున్న అట్టి ముగ్గురిని పట్టుకోవడం జరిగింది.
పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు నాలుగో నిందితుడైన కన్నదారి అనంతయ్యను నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేయడం జరిగింది.
నిందితుల వివరాలు:
A1). ఆవుల నాగిరెడ్డి,S/o.గురువారెడ్డి,44yrs,ట్రాక్టర్ డ్రైవర్,R/o.లక్ష్మిపురం
A2).దాసరి నరేష్, S/o.మల్లయ్య,35yrs, మటన్ షాపు,R/o. లక్ష్మిపురం.
A3). తాటి వీరబాబు,S/o.వెంకన్న,28yrs,కూలీ,R/o.లక్ష్మిపురం.
A4).కన్నెదారి అనంతయ్య, S/o.సెభాస్టియన్,58yrs,వృత్తి:వ్యవసాయం,R/o. నాగినేనిప్రోలు రెడ్డిపాలెం
పట్టుబడిన ఈ నలుగురు నిందితుల వద్ద నుండి బైండింగ్ వైరు,కర్రలను పాతడానికి ఉపయోగించిన గడ్డపలుగు, ఖాళీ క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఎవరైనా అటవీ జంతువులను వేటాడటానికి అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చి అమాయక జంతువుల ప్రాణాలు మరియు ఈ విధంగా అధికారుల ప్రాణాలను పోవడానికి కారణమైతే చట్ట పరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.పట్టుబడిన ఇట్టి నలుగురు నిందితులను జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరుగుతుంది.




