Kothagudem: సుస్థిర సుపరిపాలనతో సుదీర్ఘ కాల ప్రధానిగా మోడీ రికార్డ్..

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Jun 2026 2:01 PM IST
Kothagudem
X

Kothagudem: సుస్థిర సుపరిపాలనతో సుదీర్ఘ కాల ప్రధానిగా మోడీ రికార్డ్..

కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లిలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నల్లగొండ ఇన్చార్జి సన్నే ఉదయ్ ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో 12 ఏళ్లకు పైగా సుస్థిర , సుపరిపాలన అందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సృష్టించారని తెలిపారు.

భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును‌ మోదీ అధిగమించారని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా వరుసగా రెండుసార్లు గెలవడం కష్టమని , మోడీ 2014, 2019, 2024 లో వరుసగామూడవసారి ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారన్నారు. అవినీతి ఆరోపణలు లేని ప్రధానిగా మోడీ నిలిచారన్నారు. బిజెపి ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల అభివృద్ధికి పక్షపాతం లేకుండా వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చారని, రక్షణ రంగానికి 26 వేల కోట్ల రూపాయలు కేటాయించారని, ఆయుధాల్లోకి బుల్లెట్లను కొనే స్థాయి నుంచి మిస్సైల్స్ తయారు చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక వ్యవస్థ పటిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు 16 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, నాలుగు కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం.

కట్టెల పొయ్యి ,పొగతో మహిళలు తమ ఆరోగ్యాన్ని కోల్పోతున్న నేపథ్యంలో ఉజ్వల యోజన పధకం ద్వారా 11 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక సహాయం, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 200 కోట్లతో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి. ఆస్పిరేషన్ జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 50 కోట్ల నిధుల కేటాయింపు..

జాతీయ రహదారుల అభివృద్ధి,దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం అభివృద్ధికి ప్రసాదం పథకం కింద 90కోట్ల నిధులు కేటాయించిన ఘనత బిజెపికి దక్కుతుందన్నారు. దేశంలో 15 కోట్ల మందికి నల్లా ద్వారా తాగునీరు అందించిన ఘనత మోడీ కే దక్కుతుందన్నారు..

కమ్యూనిస్టు పార్టీలు సింగిల్ గా పోటీ చేసి గెలిచే సత్తా లేని తోక పార్టీలని బిజెపిని విమర్శించడం తప్పవారికి మరేమీ పని లేదన్నారు. ఎన్నికల ముందు తిట్టిన పార్టీలతో సీట్ల కోసం పొత్తులు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం దగ్గర తక్కువ రేటుకు స్థలాన్ని కొని వ్యాపార స్థలాలుగా మార్చాలని విమర్శించారు.

కేంద్ర అభివృద్ధి పథకాలను రాష్ట్రం చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నట్లు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎయిర్పోర్ట్ కు మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా స్థలం చూపించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.. బిజెపిని విమర్శించిన మహామహులు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఎద్దేవా చేశారు.. ఈ కార్యక్రమంలో మీడియా ఇంచార్జ్ నంబూరి రామలింగేశ్వర రావు.. చెరుకు భాగ్యలక్ష్మి కార్పొరేటర్.. డాక్టర్ జాటోత్ వెంకన్న..

పూనెం బిక్షపతి, కృష్ణయ్య..పూనియా నాయక్..రామారావు.. కుమార్, తుంపురి శివ.. SIR జిల్లా కన్వీనర్.. మోహన్ కృష్ణ గాయత్రి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story