Kothagudem: 26న కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలి!
Kothagudem: ఉపాధి హామీ పథకం కొనసాగింపు, రూ.700 వేతనం కోసం ఈ నెల 26న కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది.
Kothagudem: 26న కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలి!
Kothagudem: ఈనెల 26వ తేదీన కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మికుల పెద్ద ఎత్తున తరలిరావాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, రేసు ఎల్లయ్యలు పిలుపునిచ్చారు.
సోమవారం నాడు మణుగూరు సిపిఐ పార్టీ కార్యాలయంలో పేరాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా వారు హాజరై మాట్లాడుతు... వ్యవసాయ కార్మిక సంఘం (బి కే యం యు) జాతీయ సమితి పిలుపు మేరకు ఎం జి ఎన్ ఆర్ ఈజీఎస్ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని, వి బి జి రామ్ పథకాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ 100 రోజుల పథకాన్ని 200 రోజులకు పెంచాలని, దినసరి వేతనం 700 రూపాయలకు ఇవ్వాలని, రోజుకు రెండు పూటలు వేసుకుని హాజరు రద్దు చేయాలనారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ వృద్ధులకు 4000 రూపాయలు ఇవ్వాలని, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాలు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు చెల్లించాలని తదితర డిమాండ్స్ కోసం 26వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం ఉన్నామని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి గారు హాజరై మాట్లాడుతూ ...ఆనాడు వ్యవసాయ కూలీలకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతూ వలసలు పడుతుంటే యూపీఏ ప్రభుత్వం వ్యవసాయ కూలీల కోసం పేద ప్రజల కోసం జాతీయ ఉపాధి హామీ కింద ఉపాధి హామీ పథకం చట్టాన్ని తీసుకువచ్చి వారిగా ఆర్థికంగా తోడ్పాటు అందించినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, నేడు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ వి బి జి రామ్ పథకముగా తీసుకురావడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఈ దేశం కోసం పోరాడినటువంటి గాంధీజీ పేరు తో ఉన్నటువంటి ఈ పథకాన్ని పేరు మార్చాలని చూడడం సరైనది కాదని ఇప్పటికైనా విబిజీ రామ్ పథకాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు రెండు పూటల హాజరు విధానం రద్దు చేయాలని, లక్షల రూపాయలు జీతాలు తీసుకునేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు అధికారుల కూడా లేని విధంగా, ఈవిధంగా వేధింపులు ఉండవని కానీ ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ,కష్టపడి పని చేసే ఉపాధి హామీ కూలీలకు మాత్రం రెండు పూటలా సంతకాలు పెట్టే విధంగా చూడడం, దీనికోసం చట్టం తీసుకురావడం సరైనది కాదని ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఎవరు ఉన్న పేద ప్రజల కోసం వారి హక్కుల కోసం పనిచేయాలని అప్పుడే ప్రజల మంన్ననలు పొందుతారని వారు అన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ *మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, మండల కార్యదర్శి జక్కుల రాజబాబు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు జంగం మోహన్ రావు, మండల సహాయ కార్యదర్శి వేర్పుల నరేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఆధర్ల రాములు ,బాడిశ సతీష్, ఉప సర్పంచ్ పులిగిల్ల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు వరికెలవెంకన్న, సహాయ కార్యదర్శి బొమ్మెర బోయిన వీరన్న ,ఆర్గనైజింగ్ కార్యదర్శి,నోముల రవి, రైతు సంఘం మండల అధ్యక్షులు దండగల బాబు, బోసెట్టి సంపత్, రంగు ఆంజనేయులు*తదితరులు పాల్గొన్నారు.




