Ulavanur: అడవి ఉడుములను వేటాడి హింసించిన వ్యక్తిపై కేసు నమోదు!
Ulavanur: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉలవనూరులో అడవి ఉడుములను కుక్కలతో వేటాడి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వ్యక్తిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అటవీ శాఖ కేసు నమోదు చేసింది.
Ulavanur: అడవి ఉడుములను వేటాడి హింసించిన వ్యక్తిపై కేసు నమోదు!
ఉలవనూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉలవనూరు గ్రామంలో అడవి ఉడుములను కుక్కలతో వేటాడి హింసిస్తూ, ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ‘యాసా చంటి’పై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB) సౌత్ రీజియన్, చెన్నై అందించిన సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారి (DFO), కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి (FDO-WLM) ఆదేశాలతో అటవీ అధికారులు ఉలవనూరు గ్రామంలో విచారణ చేపట్టి నిందితుడిని గుర్తించారు.
అడవి ఉడుము వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని అత్యంత రక్షణ కలిగిన షెడ్యూల్-1 జాబితాలో ఉండటంతో, నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద కేసు నమోదు చేసి న్యాయస్థానానికి సమర్పించారు.
ఈ దర్యాప్తులో యానాంబైల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. కవితా మాధురి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఎస్. కృష్ణయ్య, బి. సునీత, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు బి. ఇరులాల్, బి. వెంకట్రామ్‌తో పాటు రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు.




