Raghunathapalem: ఇన్‌స్టాగ్రామ్‌లో మారణాయుధాల ప్రదర్శన.. ఆటో యూనియన్ నేతపై కేసు!

Raghunathapalem: ఇన్‌స్టాగ్రామ్‌లో మారణాయుధాలు ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రఘునాథపాలెం ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Nov 2026 7:51 PM IST
Raghunathapalem
X

Raghunathapalem: ఇన్‌స్టాగ్రామ్‌లో మారణాయుధాల ప్రదర్శన.. ఆటో యూనియన్ నేతపై కేసు!

రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం, దోనబండ ప్రస్తుత నివాసి, ఖమ్మం అర్బన్ పరిధిలోని ఖానాపురం హవేలి, రస్తోగి నగర్ స్థానికుడుమరియు రఘునాథపాలెం ఆటో యూనియన్ అధ్యక్షుడైన షేక్ మహమ్మద్ తండ్రి సయ్యద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది.

కేసు వివరాలు:

పోలీసుల సోషల్ మీడియా పర్యవేక్షణ లో భాగంగా, "Mohammadthgur" అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిందితుడు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించబడింది. నిందితుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కత్తులు ప్రదర్శిస్తూ వీడియోలను పోస్ట్ చేశాడు. అంతేకాకుండా, ఠాగూర్ సెటిల్‌మెంట్లు అనే పేరుతో మరియు గ్యాంగ్ సంబంధిత కార్యకలాపాలతో తనకు సంబంధం ఉన్నట్లు, తాను ఒక రౌడీ అన్నట్లుగా చిత్రీకరించుకుంటూ ప్రజలలో భయాందోళనలు సృష్టించే విధంగా రీల్స్ అప్‌లోడ్ చేశాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి గత నేర చరిత్ర పై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నాము. వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న నిందితుడు పై కేసు నమోదు చేసి, అతని వద్ద నుండి మారణాయుధాలను స్వాధీనపరుచుకోవడం జరిగింది.

సోషల్ మీడియా వేదికగా మారణాయుధాలను ప్రదర్శించినా, రౌడీయిజాన్ని ప్రోత్సహించే విధంగా పోస్టులు పెట్టినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్