Bhadrachalam: డిసెంబర్ 29న చలో హైదరాబాద్: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్
Bhadrachalam: ప్రజా సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 29న 'చలో హైదరాబాద్' మహా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ భద్రాచలంలో ప్రకటించింది.
Bhadrachalam: డిసెంబర్ 29న చలో హైదరాబాద్: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్
భద్రాచలం: నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం నిరంకుశ, ఫాసిస్టు విధానాలు వేడనాడాలని సర్ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను రద్దు చేయటాన్ని ఆపాలని, రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, రై తు పంటలకు కనీస మద్దతు ధరలు ఖర్చుల మీద 50 శాతం అదనంగా కలిపి నిర్ణయించాలని, ప్రభుత్వ సంస్థల ద్వారానే కొనుగోలు చేయాలనారు.
అలాగే రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 420 వాగ్దానాలు చేసిందని వాటిని అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం జరిగిందని ఇప్పటికైనా ఈ నిర్లక్ష్యం విడనాడి వాటి అమలకు చర్యలు చేపట్టాలని ముఖ్యంగా కరువు నివారణ చర్యలు చేపట్టాలని పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని ఇందిరమ్మ ఇల్లు వివిధ రకాల పెన్షన్లు ఇవ్వాలని ఉపాధి పనికి 2 వందల రోజులు పని దినాలు ఇచ్చి రోజుకూలి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వాలని, కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలనారు.
విద్యారంగ సమస్యల పరిష్కరించాలని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్లతో డిసెంబర్ 29న వేలాది మందితో హైదరాబాదులో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ర్యాలీ బహిరంగ సభ జరప తలపెట్టామని సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కెచ్చేల రంగారెడ్డి ,జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం ఈరోజు భద్రాచలంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో కరిపత్రాన్ని ఆవిష్కరించి ప్రకటించారు.
ఈ సభకు ర్యాలీకి జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అన్ని వర్గాల ప్రజలు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు కెచ్చేల కల్పన డివిజన్ నాయకులు దాసరి సాయన్న PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్,pow డివిజన్ అధ్యక్షులు మునిగేలా మహేశ్వరి, శాంతక్క, పిరిదోజ్, రమాదేవి, భాస్కర్, ప్రణయ్, ప్రసాద్, బ్లేస్సి, హాజర్ తదితరులు పాల్గొన్నారు.




