Chandrugonda: చలమల శ్రీనివాసరావు వర్ధంతి.. స్మృతివనంలో ఘన నివాళులు

Chandrugonda: చంద్రుగొండ అటవీ రేంజ్ స్మృతివనంలో దివంగత అధికారి చలమల శ్రీనివాసరావు నాలుగో వర్ధంతి నివాళులు; అటవీ పరిరక్షణ స్ఫూర్తిదాయకమని సిద్ధార్థ్ విక్రమ్ సింగ్.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 22 Nov 2026 11:24 PM IST
Chandrugonda
X

Chandrugonda: చలమల శ్రీనివాసరావు వర్ధంతి.. స్మృతివనంలో ఘన నివాళులు

చంద్రుగొండ: అటవీ సంపద, మొక్కల పెంపకాన్ని పరిరక్షించే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన దివంగత అటవీ అధికారి చలమల శ్రీనివాసరావు నాలుగో వర్ధంతి సందర్భంగా ఆదివారం చంద్రుగొండ అటవీ రేంజ్ పరిధిలోని స్మృతివనంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.

2022 నవంబర్ 22న ఇదే ప్రాంతంలో అటవీ ప్లాంటేషన్‌ను పరిరక్షించే క్రమంలో శ్రీనివాసరావుపై దాడి జరిగి ఆయన ప్రాణాలు కోల్పోయారని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ గుర్తు చేశారు. అటవీ పరిరక్షణ కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం, విధి పట్ల చూపిన అంకితభావం అటవీ శాఖ సిబ్బందికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

శ్రీనివాసరావు పనిచేసిన అటవీ ప్రాంతాల్లో నేటికీ అధికారులు, సిబ్బంది అదే బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారని, ఆయన పరిరక్షణకు కృషి చేసిన అటవీ ప్రాంతాలు, మొక్కలను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అటవీ ప్రాంతాలకు ముప్పు వాటిల్లినప్పుడు తక్షణమే స్పందించడం, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బందికి అండగా నిలవడం, అటవీ పరిసర గ్రామాల ప్రజలతో సమన్వయం చేసుకుంటూ అటవీ సంపదను సంరక్షించడం ద్వారా ఆయన త్యాగానికి నిజమైన నివాళి అర్పించగలమన్నారు.

భవిష్యత్ తరాలకు పచ్చని అడవులను అందించడమే శ్రీనివాసరావుకు అందించే అత్యుత్తమ నివాళి అని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో స్మృతివనాన్ని సందర్శించే యువ అధికారులు, విద్యార్థులు పచ్చని అడవులను చూసి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకునేలా అటవీ సంరక్షణకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU