Kothagudem: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై కమల శ్రేణుల కసరత్తు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ‘బీఎల్ఏ-2’ (BLA-2) కార్యశాల నిర్వహణ.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 31 May 2026 11:49 AM IST
Kothagudem
X

Kothagudem: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై కమల శ్రేణుల కసరత్తు!

Kothagudem: బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో BLA-2 కార్యశాల నిర్వహించడం జరిగినది. కార్యశాల ముఖ్యఅతిథి బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR ) లో కొత్త ఓటర్లను నమోదు చేయడం, డూప్లికేట్ మరియు నకిలీ ఓటర్లు తొలగించడం, ఓటర్ల వివరాల్లో ఉన్న పొరపాట్లను సరి చేయడం, పూర్తిస్థాయి ఖచ్చితమైన ఓటర్ జాబితా రూపొందించడం ఎన్నికల కమిషన్ చేపట్టబోతుంది కావున బిజెపి తరఫున BLA-2 నియమించబడ్డ వారందరూ కూడా ఇంటింటా సర్వేలో పోలింగ్ బూతులు వారిగా అధికారుల వెంట పాల్గొని నిజమైన ఓటర్లకు న్యాయం జరిగే విధంగా, నకిలీ ఓటర్లను గుర్తించి ఎన్నికల అధికారులకు BLA-2 లు తెలియజేయాలి అని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ బిజెపి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భూక్య రమేష్, మాజీ మండల అధ్యక్షుడుసిరిపురపు ప్రసాద్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, మండల ఉపాధ్యక్షులు ధరావత్ బాల కిషన్, కిష్టంశెట్టి గోపాలరావు, సోషల్ మీడియా మండల కన్వీనర్ భూక్య చరణ్, పురేటి వెంకటేశ్వర్లు, నర్వనేని కృష్ణ, పూతర్లపాటి నవీన్, పృద్వి, పది మల్ల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story